గోలుగొండ( పబ్లిక్ సత్తా) అధికారం కోసం ఎన్నికల వరకు మౌనంగా ఉండి ఎన్నికల అనంతరం, పెట్రోల్ , డీజిల్ రేట్లు పెంచి సామాన్లపై పెనుబారం మోపుతున్న బిజెపి ప్రభుత్వం, సామాన్లపై నిరంకుశ పరిపాలన చేస్తున్నారని దీనిపై సిపిఐ పార్టీ బుధవారం నిరసన కార్యక్రమం చేపడుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రాధాకృష్ణ పేర్కొన్నారు. పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ నిత్యవసర ధరలు పెంచి మోటార్ సైకిల్, ఆటో,టాక్స్ సామాన్య కార్మికులను పొట్ట కొట్టడమే. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు. వన్ ప్లస్ వన్ ఆఫర్ ( 1+1 ) రాత్రికి రాత్రే109 నుండి 113 + 118 ఇటువంటి అధిక ధరలు పెంచడం మంచి ఆఫర్ ఇవ్వడమే, ప్రధాని నరేంద్ర మోడీ సామాన్యులపై నిరంకుశ పాలన నిదర్శనం అన్నారు. రోజురోజుకి ఎండలు తీవ్రత వలన ప్రాణాలు కోల్పోతుంటే, మరోపక్క పెట్రోల్,డీజిల్, గ్యాస్ మంచం కింద కుంపటిలాగా నిత్యాసర ధరలు, పెరుగుతున్నప్పటికి ప్రజలపై జాలి,దయ లేని ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పేద, మధ్యతరగతి , ఆటో,టాక్స్ కార్మికులు, మేధావులంతా రేపు నర్సీపట్నం టౌన్ లో జరిగే ప్రజా ఉద్యమ నిరసనలో పాల్గొనవలసిందిగా,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి రాధాకృష్ణ, పిలుపునిచ్చారు.


0 Comments