రావికమతం (పబ్లిక్ సత్తా ) పంచాయతీ ఎన్నికల సంబంధించి ప్రచారాలు ర్యాలీలు మంగళవారంతో ముగియడంతో పెద్ద ఎత్తున అభిమానులతో కొత్తకోట గ్రామంలో కూటమి అభ్యర్థి పాకలపాటి సునీత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా (పబ్లిక్ సత్తా ప్రతినిధితో) ఆమె మాట్లాడుతూ రెబెల్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాలు వింటుంటే కొత్తకోట గ్రామ ప్రజలందరూ నవ్వుతున్నారని మీ సొంత గ్రామం అని చెప్పుకుంటున్న మీరు ఏమి అభివృద్ధి చేశారు ఎన్నో సంవత్సరాల నుండి శిధిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనాన్ని కట్టించగలిగారా పంచాయతీ నిధుల ఏమవుతున్నాయి గ్రామానికి ఒక కల్యాణ మండపం కట్టించగలిగారా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు మంచినీరు గ్రామమంతా ఇవ్వగలిగారా మీ సొంత నిధులతో గ్రామానికి ఏమైనా మంచి జరిగిందా ఇది నేను అంటున్న మాటలు కాదు మన గ్రామ ప్రజలు అంటున్న మాట అని తెలిపారు అదే విధంగా ఇప్పటికీ గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను అభివృద్ధి చేసే నాయకత్వానికి మీ ఓటు వేస్తారని కోరుకుంటున్నాను
0 Comments