ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఒక వరం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు


నర్సీపట్నం ( పబ్లిక్ సత్తా )ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని, ప్రజాసేవయే పరమావధిగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శుక్రవారం నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని నాతవరం మండలానికి చెందిన నలుగురికి, గొలుగొండ మండలానికి చెందిన ఒకరికి, మాకవరపాలెం మండలానికి చెందిన ఐదుగురికి, నర్సీపట్నం రూరల్ పరిధిలో ఒకరికి, మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరికి చొప్పున.. మొత్తం 13 మంది బాధితులకు రూ. 7,29,692 విలువైన చెక్కులను స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరంలా మారిందని కొనియాడారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు 199 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 1 కోటి 82 లక్షల 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ నిధి ద్వారా అందించగలిగామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా భవిష్యత్తులోనూ ప్రత్యేక చొరవ చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ అధికార ప్రతినిధి లాలం శ్రీ రంగం స్వామి, అడిగర్ల నాని బాబు, టీడీపీ మండల అధ్యక్షులు సుకల నాయుడు, నందిపల్లి వెంకటరమణ, ఆర్ వై పాత్రుడు, రావనపల్లి నీటి సంఘం ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 చెక్కులు అందజేస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>