పోషకాహారం నుంచి మౌలిక వసతుల వరకు.. గొలుగొండ మోడల్ ప్రైమరీ పాఠశాలపై ప్రత్యేక దృష్టి!
గొలుగొండ (పబ్లిక్ సత్తా) స్థానిక మోడల్ ప్రైమరీ పాఠశాలను సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీరామ్ మూర్తి సందర్శించారు. ముందుగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, స్థానికంగా లభించే మునగాకును ఆహారంలో వినియోగించడం ద్వారా పిల్లలకు మరింత పోషకాహారం అందించవచ్చని సూచించారు.అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల వివరాలను తెలుసుకుని, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న హ్యాండ్రైల్ ర్యాంప్‌తో పాటు ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై జేఈఈని అడిగి వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య, పాఠశాల మౌలిక వసతుల కల్పనపై మండలంలోని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల విద్యాశాఖ అధికారి ఓ. సత్యనారాయణకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దాసు, ఉపాధ్యాయులు బానోజీరావు, బాలకృష్ణ, ఉమ, అజ్మీత్, సీఆర్‌పీ రామకృష్ణ పాల్గొన్నారు.



0 Comments