కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

జూన్ 12 నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని                          కార్యకర్తలకు పిలుపు


గోలుగొండ( పబ్లిక్ సత్తా)నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అనేక రకాలుగా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

గొలుగొండలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నిరాశకు గురి చేశారని విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, యువత, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసిన మోసాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని గణేష్ అన్నారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

అలాగే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ నిరసనను గట్టిగా వినిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంలో కదలిక తీసుకురావడమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రాబోయే కార్యక్రమాలపై చర్చించారు. జూన్ 12న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>