కొత్తకోటలో 16 వార్డుల్లో పోటీకి సిద్ధం.. ప్రతి వార్డుకు 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు
రావికమతం (పబ్లిక్ సత్తా): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ గ్రామస్థాయిలో బలమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఆదివారం కొత్తకోట గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతల కిషోర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, గ్రామంలోని మొత్తం 16 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి వార్డుకు 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా, ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, మౌలిక వసతుల సమస్యలపై కమిటీ సభ్యులు మరియు పార్టీ ముఖ్య నాయకులు విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన అజెండా అని, స్థానిక ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

0 Comments