వైద్య ఆరోగ్యశాఖలో గొలుగొండ పీహెచ్‌సీకి ‘A’ గ్రేడ్

ప్రజా సంకల్ప వేదిక అభినందనలు
 డాక్టర్: శ్యామ్ కుమార్ 

గొలుగొండ( పబ్లిక్ సత్తా  )గొలుగొండ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా. శ్యామ్ కుమార్ సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మారుమూల పల్లెటూర్లలో సైతం తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ ప్రతి రోగికి ఆప్యాయంగా వైద్యం అందించడం, ప్రజలతో మమేకమై వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని స్థానికులు  ప్రశంసిస్తున్నారు. ఆయన నాయకత్వంలో సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల గొలుగొండ పీహెచ్‌సీ జిల్లాలో 'A' గ్రేడ్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకు ఆదర్శంగా  నిలిచిందని ప్రజా సంకల్ప వేదిక నాయకులు అభినందించారు."అనకాపల్లి జిల్లాలోని 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC)లో గొలుగొండ పీహెచ్‌సీ ‘A’ గ్రేడ్ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ప్రజా సంకల్ప వేదిక ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఇన్‌చార్జ్ జక్కు నరసింహమూర్తి, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉల్లి తలుపులు మాట్లాడుతూ, గొలుగొండకు గుర్తింపు తీసుకొచ్చిన మెడికల్ ఆఫీసర్ డా. శ్యామ్ కుమార్ తో పాటు పీహెచ్‌సీ సిబ్బందిని అభినందించారు.

జిల్లాలోని పీహెచ్‌సీలకు నిర్వహించిన గ్రేడింగ్‌లో గొలుగొండ పీహెచ్‌సీ ‘A’ గ్రేడ్‌తో ప్రథమ స్థానం సాధించగా, 26 పీహెచ్‌సీలు ‘B’ గ్రేడ్, 31 పీహెచ్‌సీలు ‘C’ గ్రేడ్, 2 పీహెచ్‌సీలు ‘D’ గ్రేడ్ సాధించాయని తెలియజేశారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>