కాలువ ఆక్రమణలపై రైతుల ఆగ్రహం

రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ షెడ్ల తొలగింపు

రావికమతం (పబ్లిక్ సత్తా): గుడివాడ గురునాధరావు రిజర్వాయర్ (కళ్యాణపులోవ) నుంచి ప్రవహించే ప్రధాన సాగునీటి కాలువను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన షెడ్లను శుక్రవారం రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో తొలగించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువలో పూడిక తొలగింపు పనులు చేపట్టేందుకు ట్రాక్టర్లు, జేసీబీలు వెళ్లే విధంగా కాలువకు ఇరువైపులా ప్రభుత్వం గతంలోనే స్థలాన్ని కేటాయించింది. అయితే కాలక్రమేణా కొందరు ఆక్రమణదారులు ఆ స్థలాల్లో షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడంతో కాలువ నిర్వహణ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తకోట గ్రామంలోని ముంతమామిడి కట్టు నుంచి ప్రవహించే ఊర కాలువ వద్ద ఊర కాలువ చైర్మన్ కలం నర్సింగరాజు ఆధ్వర్యంలో కొత్తకోట, కన్నంపేట గ్రామాల రైతులు రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో ప్రధాన రహదారి సమీపంలో కాలువకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన షెడ్లను జేసీబీ సాయంతో తొలగించారు.

ఆక్రమణలు తొలగించడంతో కాలువ నిర్వహణకు మార్గం సుగమమైందని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఆక్రమణలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>