హ్యాపీ మదర్స్ డే అని వాట్సాప్ స్టేటస్ పెట్టేంత సులభం కాదు అమ్మ అంటే!

రెండు అక్షరాల వెనుక,మనం ప్రాణం పోసుకోవడానికి తను అనుభవించిన *మరణ* వేదన ఉంది.మన ఆకలి తీర్చడానికి తను మాడ్చుకున్న, ఆకలి కడుపు ఉంది.మన బట్టలు మురికి అవ్వకూడదని తను అరిగించుకున్న చేతులు ఉన్నాయి.మనం సమాజంలో తలెత్తుకు తిరగాలని తను వంచుకున్న నడుము ఉంది.లోకమంతా మనల్ని తప్పు పట్టినా, *'నా బిడ్డ అలాంటి వాడు కాదు'* అని గొంతు చించుకుని వాదించే ఏకైక నిస్వార్థ ప్రాణం *అమ్మ.* తన సంతోషాన్ని సమాధి చేసి, మన భవిష్యత్తుకు పునాది వేసిన త్యాగమూర్తి.అమ్మ పడే కష్టం మనకు అప్పుడే అర్థం కాదు. రేపు మనకు ఒక ప్రాణం పుట్టినప్పుడు లేదా ఆ ప్రాణం మనకు దూరమైనప్పుడు మాత్రమే ఆమె విలువ ఏంటో తెలుస్తుంది.డబ్బుంటే ఏదైనా కొనొచ్చు కానీ, కన్నీళ్లు తుడుస్తూ 'నేనున్నాను రా' అని ధైర్యం చెప్పే అమ్మ ప్రేమను ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం.అమ్మ పడే కష్టం మనకు అప్పుడే అర్థం కాదు.రేపు మనకు ఒక ప్రాణం పుట్టినప్పుడు లేదా ఆ ప్రాణం మనకు దూరమైనప్పుడు మాత్రమే ఆమె విలువ ఏంటో తెలుస్తుంది.ముఖ్యంగా ఈరోజుల్లో,ప్రేమిస్తున్నా! మంటూ ఎవరెవరు ఏంటో తెలియని కొత్తగా వచ్చిన వారి వెంట పిచ్చిగా తిరిగే యువతరం ముందుగా అమ్మ ప్రేమ గురించి తెలుసుకోవాలి. అమ్మను ప్రేమించగలగాలి. వారే నిజమైన ప్రేమికులవుతారు.నిజంగా అమ్మను ప్రేమించగలిగిన వారే వేరే వారికి నిజమైన ప్రేమను పంచగలరని,గుర్తించాలి.అమ్మకు ప్రేమను పంచండి! అంతకు మించి ఆమ్మకు ఇంకేమీ అవసరం లేదు.మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!"

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>