గండి సింహాద్రి లైన్ క్లియర్

 జనసేన పార్టీలో చేరిన గండి సింహాద్రి 

విశాఖపట్నం (పబ్లిక్ సత్తా) ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు సమక్షంలో చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో, సుమారు ఐదు దశాబ్దాల నుండి చోడవరం నియోజకవర్గం రాజకీయాల్లో ఓటమి ఎరగక  కొనసాగుతున్న సీనియర్ రాజకీయ నాయకులు, రోలుగుండ మండలం,కుశర్లపూడి గ్రామానికి చెందిన గండి సింహాద్రి నేడు(శుక్రవారం) విశాఖపట్నంలో జనసేన పార్టీలో చేరారు.


వీరితో పాటు రోలుగుంట మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి గండి అరుణ క్రాంతి, కుశర్లపూడి గ్రామం మాజీ సర్పంచ్ గండి తాతాజీ , నీటి సంఘం అధ్యక్షులు గొల్లుకన్నబాబు, పాలకేంద్రం, అధ్యక్షులు కేతిరెడ్డి జోగి నాయుడు, స్కూలు కమిటీ అధ్యక్షులు గొర్లె రాజబాబు, పార్టీలో జాయిన్ అయ్యారు.వీరితో పాటు ఈ ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది ముఖ్య నాయకులు చేరారు. ఈ సందర్భంగా వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, నాగబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అనేది కేవలం అధికారం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం పవన్ కళ్యాణ్  ప్రారంభించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో ఉన్నతమైన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటూ గత 12 సంవత్సరాల కాలంలో అత్యంత అద్భుతమైన రీతిలో పార్టీని ముందు తీసుకెళ్లారని, పార్టీ విధి విధానాలకు లోబడి పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల కోసం పనిచేయాలని జాయిన్ అయిన వారందరికీ ఆయన  సూచించారు. చోడవరం నియోజవర్గం గ్రామీణ ప్రాంతానికి సంబంధించినది కాబట్టి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అందిస్తున్న సందర్భంలో చోడవరం ప్రాంతానికి సంబంధించిన ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.

పార్టీలో పనిచేసే వారికి తప్పక ప్రాధాన్యత ఉంటుందని పార్టీతో పాటు ప్రభుత్వంలొ కూడా సముచిత స్థానాలు వస్తాయని దానికి ఓపికతో సహనంతో చిత్తశుద్ధితో పార్టీలో పనిచేయాలని ఆయన అన్నారు.అలాగే పార్టీ పట్ల నిత్యం క్రమశిక్షణ కలిగిన జనసైనికుడిగా, నాయకుడిగా ప్రజలకోసం పార్టీ కోసం గత దశాబ్ద కాలం నుండి పనిచేస్తున్న పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజుని ఆయన అభినందించారు.ఈ సందర్భంగా పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ గండి సింహాద్రితో పలువురు నాయకులు నేడు పార్టీలో జాయిన్ అవ్వడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

పార్టీలో జాయిన్ చేసుకున్న  నాగబాబు,కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలొ కూటమి ప్రభుత్వంలొ ప్రజల కోసం అను నిత్యం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోలుగుంట మండల పార్టీ అధ్యక్షులు బలిజ మహారాజు, చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం మాధవి, రామప్పరావు, చోడవరం పట్టణ అధ్యక్షులు కర్రి రమేష్ పార్టీ ముఖ్య నాయకులు, లాలం నరసింగరావు, అనిమిరెడ్డి మహేశ్వరీ రమణ , కేశరపూడి శివాజి, పెద్దాడ నాగేశ్వరరావు, వజ్రపు రమేష్, సోమిరెడ్డి బాబ్జి, పరవాడ నరసింహ మూర్తి, సోమల్ల నాయుడు ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>