రోడ్లు పేరుతో కోట్ల రూపాయలు తినేశారు.

 మాకు రోడ్డు వెయ్యండి అంటూ ప్రార్థిస్తున్న గిరిజనుడు

అనకాపల్లి జిల్లా( పబ్లిక్ సత్తా:) రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ, లోసింగి,పాతలోసింగి, పెద్దగురువు, పీవీటీజీ కొందు ఆదివాసి ఆదివాసి గిరిజ ను లు 260 మంది జనాభా కొండ శిఖరంపై జీవనం, సాగిస్తున్నారు. గ్రామంలో ప్రసవించిన ప్రతిసారి నిండు గర్భిణీలకు డోలు మోతతో కొత్తూరు జంక్షన్ కు తీసుకు వెళ్లి అక్కడ నుండి ఇతర వాహనాల్లో ఆసుపత్రులకు తరలించ వలసిందే.
 బురదలో నడుచుకుంటూ వెళ్తున్న గ్రామస్తులు 

డోలి మోతలు నిర్మూలన కోసం 2024 సంవత్సరంలో. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. (మెటీరియల్ కాంఫినేట్) నిధులు నుండి అప్పట్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ సెలక్షన్ ఆర్డర్ ఇచ్చారు. స్థానిక శాసనసభ్యులు పల్లె పండగలో భాగ 2025 జనవరిలో రోడ్డు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. రోడ్డు పనులు,మొదలుపెట్టి, ఎర్త్ వర్క్, చిన్నపిక్క, క్రషర్ బూడిద వేసి వదిలేశారు.అప్పటిలో భారీ వర్షాలు కారణంగామొత్తం టిప్స్ అన్ని,కొట్టుకుపోయాయి. 2023-24 సంవత్సరంలో రావికమతం,రోలుగుంట మండల పరిషత్ నిధుల నుండి పది లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి ఇప్పుడు కూడా ఎర్త్ వర్క్ చేశారు.10 లక్షలు ఖర్చు పెట్టారు.2020 సంవత్సరంలో లోసింగి. కొత్తలోసింగి,పెద్దగరువు. మూడు గ్రామస్తులు కలిపి ఇంటికి రెండు వేలు రూపాయలు, సందాలు వసూలు చేసుకొని మొత్తం ఆరు లక్షలు ఖర్చుపెట్టి,రోడ్డు ఫార్మేషన్ చేశారు. అది కూడా భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. పల్లె పండుగలో భాగంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన డోలుమూతలు ఆగడం లేదు. లోసింగి గ్రామంలో 40 మందికి హౌసింగ్ స్కీమ్ వచ్చింది, ఇల్లు నిర్మాణాలు కట్ వర్క్ సగం మాత్రమే, జరిగాయి.
 బురద రోడ్లో ఇరుక్కుపోయిన లారీ

వర్షాకాలం రావడంతో,లోడు వాహనాలు, దిగబడి పోతున్నాయి. దీంతో హౌసింగ్ స్కీమ్ కూడా ఆగిపోయింది. ప్రభుత్వం డోలీలు నిర్మూలన కోసం ఖర్చుపెట్టిన కోట్ల రూపాయలు. కాంట్రాక్టర్ కి అధికారులకు ఉపయోగపడుతున్నాయే తప్ప! డోలు మోతలు తిప్పలు తప్పడం లేదంటున్నారు అక్కడ ప్రజలు. రోడ్డు నిర్మాణం చేయాలంటే,ఎత్తైన ఘాటీలు వద్ద సిసి ర్యాంపు వెయ్యాలి. తూతు మంత్రం గా రోడ్డు పనులు చేసి కోట్లాది రూపాయలు డ్రా చేసుకోవడం చాలా అన్యాయమని, 2026 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం, పేరు తొలగించి, విబిజి రాం జీ, పథకం రావడంతో కోటి రూపాయలు రోడ్డు పనులకు,నిధులు మంజూరు చేసుకొని ఖర్చుపెట్టినట్లు రికార్డు చూపిస్తారు. రోడ్డు పని వేరుగా చేశారు. కొత్తగా, వి.బి జి రాంజీ పథకంలో కొత్తగా నిధులు మంజూరు చేస్తే గాని తారు రోడ్డు పని చేయలేదని. రోడ్డు పనులు సగంలో నిలిపారు. దీనితో ఆ గిరిజన గ్రామాలకు డోలు మోతలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయి. కోట్లు ఖర్చుపెట్టిన రోడ్లు ఎక్కడున్నాయి. రోడ్లు చూపించండి, అంటూ గెమ్మిల అప్పారావు.కె, వెంకట్రావు. సిపిఎం, జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు పలువురు, బురద రోడ్ లో పాదయాత్ర చేస్తూ నిరసనతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>