గొలుగొండ (
పబ్లిక్ సత్తా) స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారానికి పోలీసు–రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తహసీల్దార్ నూకరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొంటున్న భూ వివాదాలను న్యాయస్థానాల వరకు వెళ్లకుండా స్థానికంగానే, పరిష్కరించేందుకు గోలుగొండ పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నాగన్నదొర పాలెం రెవెన్యూ పరిధిలో పుట్టుకూరు చినబాబుకు చెందిన 22 సెంట్ల భూమి, రీ సర్వే అనంతరం జానకిరాంపురం గ్రామానికి చెందిన కొరుప్రొలు వెంకటరమణ ,గోవిందు సాంబమూర్తి పేరుపై నమోదైనట్లు పిర్యాదు లైన కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మూడు వాయిదాల అనంతరం సంబంధిత వ్యక్తులు తమ భూ రికార్డులు సమర్పించకపోతే అసలు భూ యజమానికి భూమి అప్పగించే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నూకరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్సై రామారావు, పలువురు రైతులు పాల్గొన్నారు.
0 Comments