ఆటోతొ గంజాయి స్మగ్లర్ అరెస్ట్


నర్సీపట్నం( పబ్లిక్ సత్తా )అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం గ్రామం వద్ద  32 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసి AOB ( ఒరిస్సా) ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి జిల్లా మీదుగా తుని వరకు తరలిస్తుండగా పోలీసులు దాడి,చేసి పట్టుకున్నారు. గొలుగొండ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టి AP 31 TC 0658 నంబర్ గల ఆటో, ఒక మొబైల్ ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి, ఆటో, మొబైల్ ఫోన్ కలిపి సుమారు రూ.20 లక్షల విలువ ఉంటుందని  తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా,మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఈ వివరాలను నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు, రూరల్ సి ఐ రేవతమ్మ, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 


Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>