రావికమతం (పబ్లిక్ సత్తా) మండలంలోనే మేజర్ పంచాయతీగా పేరు పొందిన కొత్తకోట గ్రామంలో నేడు పారిశుద్ధ్య లోపం ప్రతి వీధిలో కనిపిస్తూనే ఉంటుంది పేరుకే ప్రతిరోజు స్వేపర్తో పాటుగా చెత్తను తరలించే ట్రాక్టర్ ఉంటుంది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పారిశుధ్యం పై పలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వీటిని అనుసరించాల్సిన గ్రామపంచాయతీలు మాత్రం అనుసరించకపోవడంతో నేడు గ్రామమంతా చెత్తతో నిండిపోయింది కాలువలలో కూడిక తీయించాలని స్థానికులు పలుమార్లు పంచాయతీ అధికారులకు చెప్పిన సరే పట్టించుకోవడంలేదని దీనివలన దోమల బెడద ఎక్కువైందని స్థానికులు అంటున్నారు సంబంధిత అధికారులు స్థానిక నాయకులు స్పందించి చెత్త నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
0 Comments