మహానాడు కోసం కొత్తకోటలో కార్యకర్తలకు దిశా నిర్దేశం


రావికమతం ( పబ్లిక్ సత్తా) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అత్యంత ప్రతిషాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమాన్ని ఈ ఏడాది  రాష్ట్రంలో ఉన్న  ప్రతి మండలంలో గ్రామాలను బట్టి క్లస్టర్ గా విభజించి ఆయా క్లస్టర్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మహానాడు కార్యక్రమాన్ని రావికమతం  మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి రావికమతం,మేడివాడ, కొత్తకోట,గ్రామాలలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వo ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పార్టీ అధినేతల ఆలోచనలు మరీ ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా రాజకీయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉండే విధంగా తదితర అంశాలపై పార్టీ పెద్దలు చర్చిస్తారని, మహానాడు కార్యక్రమాన్ని  కొత్తకోట సెయింట్ మేరీ  స్కూల్లో 2026వ సం మే  27,28 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు స్థానిక తెదేపా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో.  తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు, కోట గోవిందరావు  క్లస్టర్ 3.ఇంచార్జ్ బంటుశ్రీనివాసరావు యూనిట్ ఇంచార్జ్ కోట సత్యనారాయణ, యూనిట్ ఇన్చార్జ్ కర్రీ అర్జున,యూనిట్ ఇంచార్జ్ మాకిరెడ్డి రాజు, వెల్లంకి ఈశ్వరరావు, తెలుగుదేశం మండల పార్టీ కార్యదర్శి ఉగ్గిన  శ్రీనివాసరావు, గ్రామ తెదేపా  పార్టీ అధ్యక్షులు గట్ట నానాజీ, హై స్కూల్ చైర్మన్ దుప్పట్ల శ్రీనివాసరావు,చోడవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైచర్ల  శ్రీనివాసరావు చోడవరం నియోజకవర్గ ట్రేడర్స్  అధ్యక్షులు కలగర్ల రాధాకృష్ణ నీటి సంఘం వారకట్టు అధ్యక్షులు వేప రామకృష్ణకృష్ణ  ముంతకట్టు చైర్మన్ కలంనర్సింగరావు, పెద్ద కట్టు చైర్మన్ వడ్డాది నరసింహారావు, వెదురుపత్తి వెంకటాచారి, ఆదాడ తాతబాబు, గొర్లి కృపారావు, బద్రి చిన్నబ్బాయి,గాలి తారకం,బొడ్డు రమణ, కోట అప్పారావు, టిడిపి పార్టీ నాయకులు లీడర్స్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>