ఉపాధి పనుల శ్రామికుల సమస్యలను అడిగి తెలుసుకున్న పి వి ఎస్ ఎన్

 రోలుగుంట( పబ్లిక్ సత్తా)  రోలుగుంట మండలం బుచ్చెంపేట గ్రామంలో గల రావణాపల్లి జలాశయం పరీవాహక పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనిచేస్తున్న శ్రామికుల వద్దకు వెళ్లి ఈ మధ్యకాలంలో ఎండలు ఎక్కువగా కాస్తున్నందున వారికి తగు సలహాలు ఇస్తూ వారి యొక్క సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న  చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివివిఎస్ఎన్ రాజు   ఇబ్బందులు ఉన్న తనకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి అందరికీ మంచి చేకూరే విధంగా పనులు చేయిస్తామని అన్నారు. ఈ క్రమంలో రోలుగుంట మండల వీర మహిళ అధ్యక్షురాలు శ్రీమతి మహేశ్వరి రమణ  సమకూర్చిన మజ్జిగ ప్యాకెట్లను సుమారు 1000 మందికి పంపిణీ చేశారు. బుచ్చెంపేట  ప్రభుత్వ హైస్కూల్లో 543 మార్కులతో ప్రధమ స్థానం సాధించిన నడిపింటి భాగ్యశ్రీ ని అభినందిస్తూ తనకి  చిరుసన్మానం చేస్తూ శ్రీమతి మహేశ్వరి రమణ  1000 రూపాయల నగదును తనకి  ప్రోత్సాహంగా అందించారు,గ్రామానికి చెందిన ఉలభాల రాజు అనారోగ్యకారణాలతో చికిత్స చేయించుకున్నందున వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన 92,000 రూపాయల చెక్కును వారికి  అందించారు,కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన అనిమిరెడ్డి మహేశ్వరుని పి వి ఎస్ ఎన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జానకిరామపురం పిఎసిఎస్ చైర్మన్ బలిజ




మహారాజు, రోలుగుంట మండల ప్రోగ్రాం కమిటీ చైర్మన్ లాలం నర్సింగరావు, పార్టీ నాయకులు అర్పి త్రినాధం, గాలి బాలరాజు , బుంగా కోటి బాబు, కేసరపూడి శివాజి, దిమిలి సత్య, శిరసపల్లి శివ, చింతల కిషోర్ కలం మోహన్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>