గోలుగొండ (పబ్లిక్ సత్తా), అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం" పాకలపాడు గ్రామంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. పని చేసిన రోజులకు పూర్తి వేతనం చెల్లించడం లేదని కూలీలు ఆరోపించారు.ఆరు రోజులు పని చేసినప్పటికీ ఐదు రోజులకే మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ హాజరు,నమోదు కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పనులు లేక వలస పోతున్న కూలీలకు ఉపాధి కల్పించాలని నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అధికారులు తూట్లు పొడుస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.
మండుటెండల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు తాగునీరు, నీడ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.NREGA అధికారులు ఫీల్డుకి రాకుండానే పనులు గుర్తించి వేతనాలు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాము చేస్తున్న పనులను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించకుండా, పని చేయలేదంటూ సాకులు చూపించి వేతనాలు తగ్గిస్తున్నారని కూలీలు మండిపడ్డారు. ఉపాధి కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించి, చేసిన పనికి పూర్తి వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.


0 Comments