నర్సీపట్నం ( పబ్లిక్ సత్తా ) రాజకీయ లబ్ధి కోసం పాస్టర్ అభినయ్ దర్శన్ సినిమా షూటింగ్ స్టైల్ లో తనపై తానే దాడి చేయించుకుని, అక్కడ అమాయక ప్రజలను నమ్మించి, ఏమి తెలియనట్టు, కట్టుకథలు సృష్టించి చివరికి కటకటాల పాలయ్యాడు. నర్సీపట్నం జైలులో ఉన్న పాస్టర్ అభినయ్ దర్శన్ ఈరోజు (గురువారం) ఉదయం బెయిల్ పై విడుదలయ్యారు. పోలీసులు విచారణలో తనదైన స్టైల్ లో నిజాన్ని నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన మరుక్షణం పాస్టర్ అభినయ్ దర్శన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్య మని స్పష్టం చేశారు. అతి త్వరలోనే చింతపల్లిలో ప్రెస్ మీట్ పెడతానని తెలిపారు.
0 Comments