గోలుగొండ( పబ్లిక్ సత్తా) మండలంలో సామాజిక వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఎంపీడీవో ఉలబాల శ్రీనివాసరావు పలు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సి ఎస్ సి అవగాహన డాక్యుమెంటరీ ద్వారా జరిగిన శిక్షణా కార్యక్రమంలో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజా భాగస్వామ్యం పెరగాలని, గ్రామాల్లో ఉండే మరుగుదొడ్లే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అంగన్వాడి, పాఠశాలలు పంచాయతీ భవనాలు వద్ద ఉండే మరుగుదొడ్లను గుర్తిస్తాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలతో పాటు ఆయా సిబ్బంది కూడా అవగాహన కలిగించాలన్నారు. వీటి ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments