నర్సీపట్నం( పబ్లిక్ సత్తా) రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై రాజారావు పోలీస్ సిబ్బందితో, కలిసి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పట్టుకున్నారు.ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన చల్లా గోపి, ఒడిశా రాష్ట్రానికి చెందిన కిల్లో మాధవ్ అనే ఇద్దరు వ్యక్తులు 25 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా నెల్లిమెట్ట వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సి ఐ రేవతమ్మ, ఎస్ఐ రాజరావు తెలిపారు.గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.
![]() |
| గంజాయితో పట్టుబడిన నిందితులతో పోలీసులు |

0 Comments