పాడేరులో జూన్ 12న వైఎస్సార్సీపీ 'వెన్నుపోటు దినం' నిరసన కార్యక్రమం
![]() |
| వైఎస్ఆర్ సీపి' మండల పార్టీ అధ్యక్షులు" బి, అప్పారావు |
కొయ్యూరు( పబ్లిక్ సత్తా ) మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. పాడేరు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం (టీడీపీ, బీజేపీ, జనసేన) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 12న పాడేరులో "వెన్నుపోటు దినం" పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల, పంచాయతీ స్థాయి నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొయ్యూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు కోరారు.

0 Comments