![]() |
| విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం |
ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడంతో పెద్ద మొత్తంలో ద్రవ లోహం చెలరేగి, పలువురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కొందరు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం.
ఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు.8మంది మృతి చెందినట్లు సమాచారం, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు సంఘటనపై విచారణ చేపట్టగా, మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో...స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదస్థలంను హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మీ.. కోసం. చిన్న వీడియో.


0 Comments