రైతులకు APAIMS ఎరువుల విక్రయ విధానంపై అవగాహన


గోలుగొండ (పబ్లిక్ సత్తా) మండలంలో కొత్తయెల్లవరం, రాజుపేట గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 8 నుంచి అమలులోకి తీసుకొచ్చిన APAIMS యూరియా, డి.ఏ.పీ అనుసంధాన ఎరువుల విక్రయ విధానంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారి (AO) సుదరాణి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కొత్త విధానం ద్వారా సాగు చేస్తున్న ప్రతి రైతుకు అవసరమైన యూరియా, డి.ఏ.పీ ఎరువులు అందుబాటులో ఉండటంతో పాటు విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అలాగే ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు.

రైతులు ప్రైవేట్ ఎరువుల దుకాణాలు లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్లే సమయంలో భూమి పట్టాదారు పుస్తకం, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS) అగ్రోనమీ శాస్త్రవేత్త బి.ఎన్. సందీప్ నాయక్ రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు. “ఖేతీ బచావో అభియాన్”లో భాగంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

వరి సాగుకు ముందు జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల పంటలను సాగు చేసి, పూత దశలో భూమిలో కలపడం ద్వారా ఎకరాకు 10 నుంచి 20 కిలోల వరకు యూరియా వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ పద్ధతితో నేలలో సేంద్రీయ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు (VHA) కె. నరేష్ తదితరులు పాల్గొని రైతులకు నూతన ఎరువుల విక్రయ విధానం, భూసార పరిరక్షణ చర్యలపై సూచనలు అందించారు. గోలగొండ మండల రైతులు కొత్త విధానాన్ని సద్వినియోగం చేసుకుని, శాస్త్రవేత్తల సూచనలను పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>