గోలుగొండ ( పబ్లిక్ సత్తా) మండలం ఎర్రవరం గ్రామం సమీపంలోని అడవి రాజలబాబు గుడి వద్ద ఆదివారం సాయింత్రం వీదుర గాలితో కురిసిన వర్షం కారణంగా ఓ పెద్ద చెట్టు రోడ్డుపై కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
సమాచారం అందుకున్న వెంటనే గోలుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక గ్రామస్తుల సహకారంతో ప్రొక్లెయినర్, ట్రాక్టర్ల సహాయంతో చెట్టును తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు.
పోలీసులు, గ్రామస్తుల సమిష్టి కృషితో ట్రాఫిక్ సమస్య త్వరితగతిన పరిష్కారమై వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. పోలీసులు చేపట్టిన వేగవంతమైన చర్యలను స్థానికులు అభినందించారు.

0 Comments