వ్యాన్, ఆటో స్వీయ ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

పబ్లిక్ సత్తా :-  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని  జి. మాడుగుల మండలం వంజరి పంచాయతీ పరిధిలోని ములకాయపుట్టు సమీపంలో ఆదివారం రాత్రి వ్యాన్ మరియు ఆటో స్వీయ ప్రమాదానికి గురయ్యాయి.  

ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న రఘు (35) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి మణి (21) తీవ్ర గాయాలు పొందాడు. అలాగే ఆటోలో ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

గాయపడిన ఇద్దరిని స్థానికులు, అత్యవసర సిబ్బంది సహాయంతో తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.




Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>