రావికమతం (పబ్లిక్ సత్తా) నూతనంగా మంజూరైన కొత్త పెన్షన్లు కార్యక్రమంలో భాగంగా మండలంలో పలు గ్రామాలలో స్థానిక తెదేపా నాయకులతో కలిసి పెన్షన్లు పంచే కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కే వి ఎస్ ఎన్ఎస్ రాజు పాల్గొన్నారు మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి పలువురికి పెన్షన్లను అందజేశారు అలాగే స్థానిక సమస్యలపై పలువురిని అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలను విని నా స్థాయిలో చేసే పనులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని అదేవిధంగా మీ సమస్యలను స్థానిక నాయకులకు తెలియజేస్తే వారు నేరుగా మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గట్టా నానాజీ కోట నీలవేణి గోవిందరావు కోట సత్యనారాయణ ఉగ్గిన శ్రీనివాసరావు వెల్లంకి ఈశ్వరరావు వేప రామకృష్ణ కిషోర్ సుందరపు శ్రీనివాసరావు రాజాన కొండనాయుడు గొర్లి కృపారావు
మైచర్ల శ్రీను వడ్డాది నర్సింగరావు తదితర ముఖ్య నాయకులతో పాటుగా అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు



0 Comments