గొలుగొండ( పబ్లిక్ సత్తా) మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు గజ్జలపు మణికుమారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేపట్టారు. మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు మరియు అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యు.వి. శ్రీనివాసరావు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి రమణ, డీసీఎంఎస్ చైర్మన్ డీటీ చైనులు, వైస్ ఎంపీపీ సుర్ల ఆదినారాయణ, జక్కు నాగమణి, చోద్యం సహకార సంఘం చైర్మన్ చిటికెల సాంబమూర్తి, చీడిగుమ్మల సహకార సంఘం చైర్మన్ భీమిరెడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

0 Comments