"టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురికి ఛాన్స్, జనసేనకు ఒక స్థానం"


అమరావతి ( పబ్లిక్ సత్తా ) రాబోయే జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ తరఫున ముగ్గురికి అవకాశం కల్పించింది.

రాజ్యసభ బరిలో టీడీపీ అభ్యర్థులు:

:- భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ

:- ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త సానా సతీష్

:- టీడీపీ సోషల్ మీడియా విభాగం అధినేత చింతకాయల విజయ్

ఆంధ్రప్రదేశ్‌, లో" ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలకు టీడీపీ పోటీ చేయనుండగా, మిత్రపక్షం జనసేనకు ఒక స్థానం కేటాయించింది. జనసేన ఇప్పటికే లింగమనేని రమేష్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో విద్యా, పారిశ్రామిక, యువ నాయకత్వ రంగాలకు ప్రాధాన్యం కల్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జనసేనకు ఒక సీటు కేటాయించడం విశేషంగా నిలిచింది.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>