రజస్వల ఆహ్వాన వేడుకకు హాజరైన ప్రముఖులు


కొయ్యూరు( పబ్లిక్ సత్తా) మండలం లో కినపర్తి గ్రామంలో పొట్టిగా వారి కుటుంబం నిర్వహించిన రజస్వల ఆహ్వాన వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు బాలికను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలో అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొడుగు అచ్యుత్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రీమల గంగాధర్, అల్లూరి సీతారామరాజు జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ పాటీ చంద్రశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడు దూరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు బాలికకు ఆశీస్సులు అందజేసి, విద్యా రంగంలోనూ, జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>