"డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారూ… మా మాట ఒక్కసారి వినండి…"
అడవుల మధ్య… కొండల నడుమ… నాగరిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఈ గిరిజన కుటుంబాల కన్నీటి గాథ ఇది.
తరాలు మారుతున్నాయి… ప్రభుత్వాలు మారుతున్నాయి… కానీ వీరి తలరాత మాత్రం మారడం లేదు.
చిన్నారులు చేతులు జోడించి వేడుకుంటున్నారు…
"పవన్ కళ్యాణ్ సార్… మా గురించి కాస్త ఆలోచించండి… మాకు న్యాయం చేయండి…"
యువకులు, మహిళలు, గ్రామస్తులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు…
"ఎన్నాళ్లు ఈ కష్టాలు…? తరాలు మారుతున్నా మా జీవితాలు మారవా…?"
ప్రాథమిక సౌకర్యాల కోసం… విద్య కోసం… ఉపాధి కోసం… తమ హక్కుల కోసం…
ఈ గిరిజన ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.
"డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారూ… మా గ్రామాలపై ఒకసారి దృష్టి పెట్టండి. మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేలా న్యాయం చేయండి…"
అని కన్నీటి మనసుతో వేడుకుంటున్నారు.
"తరాలు మారుతున్నాయి… కానీ మా తలరాతలు ఎప్పుడు మారతాయి…?"
ఇది వారి ఆవేదన… ఇది వారి ఆకాంక్ష… ఇది గిరిజన ప్రజల గుండె చప్పుడు…!
0 Comments