నర్సీపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైన సురభి నాటక ప్రదర్శనలు

నర్సీపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైన సురభి నాటక ప్రదర్శనలు

నర్సీపట్నం ( పబ్లిక్ సత్తా) శ్రీ వినాయక నాట్యమండలి, సురభి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పౌరాణిక నాటక ప్రదర్శనలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో నేటి తరానికి నాటకాల గొప్పదనం, వాటి సాంస్కృతిక ప్రాధాన్యం గురించి అవగాహన తగ్గిపోతోందని అన్నారు. సురభి కళాకారులు ప్రదర్శించిన 'మాయాబజార్' నాటకం అచ్చం సినిమా సెట్టింగ్స్‌ను తలపించేలా అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. సంప్రదాయ కళారూపాలను సంరక్షించేందుకు కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సురభి కళాబృందం ప్రదర్శనలను ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షించి, ఈ అరుదైన కళా సంపదను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించనున్న 'శ్రీనివాస కళ్యాణం' నాటకాన్ని కుటుంబ సభ్యులతో, చిన్నారులతో కలిసి వచ్చి తిలకించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్, కుటుంబ సభ్యులు, ప్రముఖులు, కళాభిమానులు పాల్గొని నాటక ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. సురభి కళాకారుల అద్భుత నటనకు ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>