రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన దాడి వీరభద్రరావు
నర్సీపట్నం( పబ్లిక్ సత్తా)ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా శ్రీ చింతకాయల విజయ్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని ఆయన నివాసంలో మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారు కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకుడు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తరువాత దాదాపు మూడు దశాబ్దాల అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన చింతకాయల విజయ్ చిన్ననాటి నుంచే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని దాడి వీరభద్రరావు తెలిపారు. అలాంటి నాయకుడికి రాజ్యసభ సభ్యత్వం దక్కడం పార్టీ కార్యకర్తలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. విజయ్ రాజ్యసభలో ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


0 Comments