సాంప్రదాయ శైలిలో రాయల్ పెయింట్స్ ప్రత్యేక ప్యాక్ విడుదల

భారతీయ
 సాంప్రదాయ శైలిలో రాయల్ పెయింట్స్ ప్రత్యేక ప్యాక్ నూతనంగా మన నర్సీపట్నంలో లాంచ్ నర్సీపట్నం, (పబ్లిక్ సత్తా) జూన్ 13: భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన రాయల్ పెయింట్స్ ప్రత్యేక ప్యాకేజింగ్‌ను నర్సీపట్నంలోని అబిత్ సెంటర్‌లో గల రెడ్డి పెయింట్స్ అండ్ జనరల్ స్టోర్‌లో శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ప్రొప్రైటర్లు కొరుపోలు రమేష్, వాణి దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక ప్యాక్‌ను విడుదల చేశారు. కలంకారి కళారూపాలు, భరతనాట్యం, సంక్రాంతి గొబ్బెమ్మలు, ఇటుకప్పాక బొమ్మల చిత్రాలతో రూపొందించిన రాయల్ పెయింట్స్ ప్రత్యేక ప్యాక్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. 
స్థానిక సంస్కృతి, కళలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ ప్యాకేజింగ్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు, వినియోగదారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>