గోలుగొండ(
పబ్లిక్ సత్తా) అనకాపల్లి జిల్లాలో గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలో బలమైన గాలుల ప్రభావంతో వెదురు పొదలు రహదారిపై కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న గొలుగొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వెదురు పొదలను తొలగించారు. పోలీసుల సత్వర చర్యతో మార్గం పూర్తిగా క్లియర్ అయి, వాహనాల రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా స్పందించిన పోలీసు సిబ్బందిపై స్థానికులు, వాహనదారులు ప్రశంసలు కురిపించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న గొలుగొండ పోలీసుల సేవలను అభినందించారు.
0 Comments