నాతవరం మండలంలో భారీ వర్షం


నాతవరం( పబ్లిక్ సత్తా) మండలంలో శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి భగభగలు, వడగాల్పులతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఊరట కలిగించింది. సుమారు గంటకు పైగా కురిసిన వర్షంతో మండలంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఎండ తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రైతులు, ప్రజలు ఈ వర్షాన్ని స్వాగతిస్తూ ఉపశమనం వ్యక్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురిసినట్లు సమాచారం.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>