మహిళలకు చేయూత నిచ్చేందుకు కుట్టు మిషన్ల పంపిణీ


కొయ్యూరు( పబ్లిక్ సత్తా ) మండలంలో అంతాడా పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ టైగర్ డైరెక్టర్ కృష్ణారావు ఆధ్వర్యంలో 21 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మహిళలు తమ జీవనోపాధిని, మెరుగుపరుచుకోవడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో జీవం స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రూరల్ ఫ్రెష్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్‌రావు, టీడీపీ మండల అధ్యక్షుడు కాకూరు చంద్రరావు, కో-ఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ రీమల చంద్రరావు, మాజీ సర్పంచ్ ఇరువాడ దేవుడు, బీజేపీ జిల్లా కార్యదర్శి బచ్చల అన్నపూర్ణ, మండల ప్రధాన కార్యదర్శి సిగ్గే సన్యాసిరావు, బీజేపీ మండల కార్యదర్శి బూదరాళ్ల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>