నర్సీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ


నర్సీపట్నం( పబ్లిక్ సత్తా ) మున్సిపాలిటీలో  23వ వార్డు పాత బస్టాండ్‌ వద్ద స్వర్గీయ ఎన్ టి రామారావు  విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పద్మావతి శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని కొనియాడారు. గత రెండేళ్లలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.242.66 కోట్ల వ్యయంతో 319 అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నర్సీపట్నం తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.185 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.2.63 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే 23వ వార్డులో రూ.90 లక్షలతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 40 వార్డులకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నలంద రాజేష్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా హాజరై నివాళులర్పించారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>