రావికమతం (
పబ్లిక్ సత్తా)రావికమతం మండలం కొత్తకోటలో స్థానికంగా దిబ్బల పాలెం నుంచి సెంట్ మేరీస్ స్కూల్ వరకు రోడ్డుకి ఇరుపక్కల ఆర్ అండ్ బి అలాగే పంచాయతీ స్థలాలు ఆక్రమణకు గురి అయ్యాయి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన ఆక్రమణదారులు మరింత ఎక్కువయ్యారు ఇటీవల పెంటపాటి సూర్యారావు మెమోరియల్ హై స్కూల్ అభివృద్ధి పనుల కోసం స్థానిక ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఎమ్మెల్యే కె వి ఎస్ రాజు సంయుక్తంగా ఈ స్కూల్ అభివృద్ధి కోసం కొంత నిధులు కేటాయించారు అయితే సంబంధిత అధికారులు గతంలో ఉన్న కాలువను వదిలేసి నేడు కొత్తగా జరాయితీ స్థలాల్లో ఉన్న స్థలాలలో నుండి కాలువ తీసేందుకు సిద్ధమయ్యారు అయితే తమకున్న పరిధిలో నిర్మాణం చేపట్టామని ఇది సమంజసం కాదని బిల్డింగ్ యజమానులు చెప్పిన బేకాతరు చేస్తున్నారని వారు వాపోయారు అలాగే ఈ స్కూల్ కి అనుకొని 22 షాపులు బడ్డీలు రూపంలో కంటైనర్ రూపంలో పక్కా బిల్డింగ్ రూపంలో ఉన్నప్పటికీ అధికారులు కానీ ప్రజాప్రతిని గాని స్కూలు యాజమాన్యం కానీ పట్టించుకోవడం పట్ల పట్టించుకోకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. అలాగే పాతకాలవ పద్ధతి ప్రకారం కాలువ నిర్మాణం చేపట్టాలని భవన యజమానులు గట్రెడ్డి ప్రకాష్ రావు, కోళ్ల ఫారం రెడ్డి కోరుతున్నారు
0 Comments