కొత్తకోటలో వెన్నుపోటు దినోత్సవం
రావికమతం :- అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో మాజీ మంత్రి కరణం ధర్మశ్రీ అమర్నాథ్ ఆధ్వర్యంలో "వెన్నుపోటు దినోత్సవం" సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ హామీలను గుర్తు చేస్తూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

0 Comments