అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ

బాలల అభివృద్ధి గుర్తింపులో ‘నవచేతన’ కీలకం - సీడీపీవో
 పబ్లిక్ సత్తా :-  అనకాపల్లి జిల్లా గొలుగొండ కేజీబీవీ పాఠశాలలో అంగన్వాడీ  కార్యకర్తలకు బాల్యారంభ అభివృద్ధి (ECD) మరియు అభివృద్ధి ట్రైనింగ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో గౌరి మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే తొలి వెయ్యి రోజులు చిన్నారి ఎదుగుదలలో అత్యంత కీలకమని, ఈ సమయంలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పిల్లల భవిష్యత్ విద్య, ఆరోగ్యం, సామాజిక నైపుణ్యాలకు ఈ దశలో అందే పోషకాహారం, సంరక్షణ, అభ్యసన అవకాశాలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.పిల్లల అభివృద్ధిలో ఏవైనా ఆలస్యాలను ముందుగానే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “నవచేతన” అనే మొబైల్ ఆధారిత స్క్రీనింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల శారీరక, మానసిక, భాషా మరియు సామాజిక అభివృద్ధిని అంచనా వేయవచ్చని వివరించారు.అంగన్వాడీ కార్యకర్తలకు అభివృద్ధి మైలురాళ్ల గుర్తింపు, వయస్సుకు అనుగుణంగా స్క్రీనింగ్ నిర్వహణ, అభివృద్ధి లోపాల గుర్తింపు, ముందస్తు జోక్యాలు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించే అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.అలాగే స్క్రీనింగ్ అనంతరం కుటుంబాలకు వాట్సాప్ సందేశాలు, వీడియోలు, ఐవీఆర్ఎస్ సేవలు, ముద్రిత సమాచార కార్డుల ద్వారా అవసరమైన సూచనలు అందించనున్నట్లు చెప్పారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.“పిల్లలే దేశ భవిష్యత్తు. తొలి వెయ్యి రోజుల్లో సరైన సంరక్షణ, పోషణ, ముందస్తు గుర్తింపుతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది వేయవచ్చు” అని సీడీపీవో గౌరి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తి, సూపర్వైజర్లు పీవీ రాఘవ, ఎ. విజయలక్ష్మి, పి. సత్యవతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>