గొలుగొండ( పబ్లిక్ సత్తా ) మండల నూతన తహసీల్దార్‌గా వి. శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి బదిలీపై ఆయన గొలుగొండ మండలంకు వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు, ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తానని చెప్పారు.

0 Comments