జూలై 8న వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

జూలై 8న వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు పిలుపు

 కొయ్యూరు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు 
కొయ్యూరు, జూలై 6 (పబ్లిక్ సత్తా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను జూలై 8న కొయ్యూరు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్‌చార్జి మత్స్యరాస విశ్వేశ్వర రాజు సూచనలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాల వద్ద జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యక్రమం నల్లగొండలోని వైఎస్సార్ విగ్రహం వద్ద జూలై 8న ఉదయం 10 గంటలకు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిడిజన అప్పారావు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>