కొత్తకోట కో-ఆపరేటివ్ పరిధిలో 8.3 టన్నుల వరి విత్తనాల సరఫరా

కొత్తకోట కో-ఆపరేటివ్ బ్యాంకు పరిధిలో  8.3 టన్నుల వరి విత్తనాలు పంపిణీ  

రావికమతం(పబ్లిక్ సత్తా)కొత్తకోట కో-ఆపరేటివ్ బ్యాంక్ పరిధిలో రైతులకు అవసరమైన వరి విత్తనాలను వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 

శ్రీకాకుళం సన్నలు (RGL-2537), మార్టేరు సాంబ (MTU-1224), MTU-1262, స్వర్ణ (MTU-7029), MTU-1318, సాంబ మసూరి (BPT-5204), అమర (MTU-1064). తదితర రకాల విత్తనాలు ఉన్నాయిని, సుమారు 8.3 టన్నుల విత్తనాలు కొత్తకోట పంచాయతీ పరిధికి చేరగా, అందులో ఇప్పటికే 6.3 టన్నుల విత్తనాలు రైతులకు విక్రయించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం, అంచనా మేరకు 2 టన్నుల మేర RGL-2537 (శ్రీకాకుళం సన్నలు) రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

కొత్తకోట-1 పరిధికి గ్రామ వ్యవసాయ సహాయకుడు జి. సాయికుమార్ ఇంచార్జ్‌గా, కొత్తకోట-2 మరియు 3 పరిధులకు గ్రామ వ్యవసాయ సహాయకుడు ఎస్.ఎస్. సన్యాసినాయుడు ఇంచార్జ్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు.  రైతులు తమ వ్యవసాయ సమస్యలపై తమ పరిధి వ్యవసాయ సహాయకులను  అడిగి తెలుసుకోవలసిందిగా తెలియజేశారు. 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>