రావికమతం( పబ్లిక్ సత్తా ) గతం నుండి కూడా దొండపూడి రెవిన్యూ పరిధిలో ఉన్న కొత్తకోట గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన భూములకు పాసుబుక్కులు లేకపోవడంతో అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న సరే తమ గోడును పట్టించుకునే నాధుడు లేకపోవడంతో స్థానిక చోడవరం జనసేన ఇంచార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు దృష్టికి తీసుకెళ్లగా రైతులకు న్యాయం చేసేందుకు ముందడుగు వేశారు ఈ సందర్భంగా రావికమతం తహసీల్దార్ గారిని కలిసి ఈ విషయంపై సమగ్రంగా చర్చించారు ఒక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని తహసీల్దార్ తెలిపారు సంబంధిత భూముల రైతులు దాసరి చిన్నబ్బాయి దాసరి శివ దాసరి శ్రీను ఎల్లేటి అప్పారావు పార్టీ నాయకులు చింతల కిషోర్ కోన రమణ కలం మోహన్ తదితరులు పాల్గొన్నారు

0 Comments