విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

 విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

రూ.2.50 లక్షల ఆస్తి నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని యజమాని గోవిందు విజ్ఞప్తి
రావికమతం, జూలై 31 (పబ్లిక్ సత్తా): రావికమతం మండలం కొత్తకోట గ్రామంలోని వెంకట హనుమాన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కిచెన్‌లో గురువారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కిచెన్‌లోని సామాగ్రి క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కిచెన్‌లోని వంట సామాగ్రి, కూరగాయలు, ఫ్రిజ్, గ్రైండర్లు, మిక్సీలు, కూలర్లు, విద్యుత్ వైరింగ్, ఇతర వంట పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు రెస్టారెంట్ యజమాని గోవిందు తెలిపారు.

అగ్నిప్రమాదం కారణంగా రెస్టారెంట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, వ్యాపారం కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రెస్టారెంట్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తమ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం తరఫున తగిన ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గోవిందు విజ్ఞప్తి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి యజమానికి ధైర్యం చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>