రావికమతం (పబ్లిక్ సత్తా) ఆషాఢ మాసం సందర్భంగా రావికమతం మండలం కొత్తకోట గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేపా రామకృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
శాకంబరీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

0 Comments