రావికమతం (పబ్లిక్ సత్తా) స్థానిక సంస్థల ఎన్నికలలో మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామానికి చెందిన జడ్పిటిసి అభ్యర్థి పైల సన్యాసమ్మ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. సంబంధిత అధికారులు ఓటర్లకు స్లిప్పులుఇవ్వడంలో అలసత్వం వహించినందువలన చాలామంది తమను అభిమానించే వాళ్ళు చాలామంది ఓటు వేయలేకపోయారని 100% అవ్వాల్సిన ఓటింగ్ సుమారు 60 శాతం నుండి 70 శాతం మధ్యలో ఓటింగ్ జరిగినట్లు ఆమె తెలిపారు. చివరకు తన రెండవ కుమారుడు ఓటర్ స్లిప్ కూడా లేకపోవడం తనను ఆశ్చర్యాలకు గురి చేసిందని ఆన్లైన్లో వెతికిన సరే తన కుమారుడు ఓటు లేదు దీనిని బట్టి చూస్తే అధికార పార్టీ ఎంత దిగజారుడుతనానికి అయినా సరే పాల్పడతారని ఆమె అసహనం వ్యక్తం చేశారు
0 Comments