రావికమతం (పబ్లిక్ సత్తా) నియోజకవర్గంలోనే పేరుగాంచిన మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామంలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు కూటమిలో ఉన్న ఇరు పార్టీలు తగ్గేదేలే అన్నట్టుగా నామినేషన్ వేయడం జరిగింది . అయితే కూటమి ధర్మం ప్రకారం గతంలోనే తెదేపా వర్గీయులకు చోడవరం ఎమ్మెల్యే కె వి ఎస్ ఎన్ ఎస్ రాజు కొత్తకోట పంచాయతీ జనసేనకు కేటాయించడం జరిగిందని తెలిపారు అయినప్పటికీ ఎమ్మెల్యే మాట పెడచెవిన పెట్టి తెదేపా నాయకులు నామినేషన్ వేయడంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు అయినప్పటికీ వారు వెనక్కి తగ్గిపోవడంతో ఈ విషయాన్ని జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ కు తెలియపరచడంతో వెంటనే స్పందించి కొత్తకోట పంచాయతీ జనసేనకు కేటాయించాలని ఆదేశాలు ఇవ్వడంతో హుటాహుటిన అనకాపల్లి తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఎమ్మెల్యే కే వి ఎస్ ఎన్ ఎస్ రాజు, జనసేన ఇంచార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు, రావికమతం మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు స్థానిక సీనియర్ నాయకులు కలిసి కూటమిలో భాగంగా జనసేన తరఫున పోటీ చేస్తున్న పాకలపాటి సునీతను బలపరచడం జరిగిందని ఆమె గెలుపుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు ఒకవేళ రెబల్ గా ఎవరైనా పోటీ చేసి వారు గెలిచిన ఓడిన సరే పార్టీ వారిని బహిష్కరిస్తుందని అంతేకాకుండా వారికి సహకరిస్తున్న మిగతా నాయకులపై వేటు ఉంటుందని ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వారు అవకాశం కోల్పోతారని తెలిపారు .
0 Comments