రావికమతం (పబ్లిక్ సత్తా) మండలంలో గల మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామంలో ఏదో ఒక వార్డు నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్రాగునీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఇంటింటి కొళాయి ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టింది.కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు గతంలో కూడా పలు వార్డులలో ఇంటింటి కొళాయి ద్వారా వచ్చే నీరులో బురద, కీటకాలు, రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు తాజాగా కాపుల దిబ్బ వీధిలో కొళాయి ద్వారా వచ్చే నీరు ఎరుపు రంగుగా రావడంతో స్థానికులు ఆందోళన చెందారు ఇటువంటి నీరు త్రాగి మా ఆరోగ్యాలు పాడు చేసుకోవాలా కనీసం త్రాగడానికి మంచినీరు అయిన ఇవ్వలేరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే మేము త్రాగేందుకు కుళాయి ద్వారా మంచినీరు ఇప్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

0 Comments