కొయ్యూరు(పబ్లిక్ సత్తా)మండలంలో పెదమాకవరం, రామరాజుపాలెం,కత్రాలలొద్ది,గానుగులు తదితర గ్రామాల పశువుల రైతులకు పంచాయతీ పాలకులు విజ్ఞప్తి చేశారు. పశువులను సాయంత్రం కల్లా మీ పశువులను తీసుకొని వెళ్లి దొడ్డిలో తప్పనిసరిగా కట్టుకోవాల్సిందిగా కోరారు. హైవేలో పశువులు ఉండటం వలన తరసు ప్రమాదాలు, జరుగుతున్నాయని.కావున తమ పశువులను తప్పనిసరిగా సాయంత్రం కల్లా మీ పశువుల దొడ్డిలో కట్టుకోవాలని,లేనియెడల ఎవరైతే పశువులు గల రైతులు వారి పశువులను హైవే రోడ్డు మీద ఉన్నాయని తెలిస్తే,వారి పశువుల నిమిత్తము ఆ రైతులకు పోలీసు వారు జరిమానా లేదా చట్ట పరమైన కేసులు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పశువులకు సంబంధించిన వ్యక్తులు బాధ్యతలు తీసుకోవాలని పంచాయితీ పాలకులు తెలిపారు.

0 Comments